‘జూనియర్‌ పవర్‌ స్టార్‌ అనొద్దు’

19 Jun, 2018 15:00 IST|Sakshi

నటి, దర్శకురాలు, రచయిత రేణు దేశాయ్‌ తన పిల్లల గురించి సోషల్‌ మీడియాలో తరుచూ పోస్టింగ్స్‌ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా రేణు తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవర్‌స్టార్‌ అనకూడదని తెలిపారు. అలా పిలవడం అకీరాకు గానీ, తల్లినైనా నాకు గానీ, అతని నాన్నకు గానీ ఇష్టం లేదన్నారు. ఇకనైనా అలా పిలువడం ఆపాలని కోరారు. ఏవరైనా అలాంటి కామెంట్లు చేస్తే తన పీఆర్‌ టీమ్‌ వాటిని తొలగిస్తుందని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా ల్యాప్‌ టాప్‌లో గేమ్‌ కోసం వెతుకుతున్న ఫొటోను ఉంచిన రేణు.. తను యూరోపియన్‌ సినిమాలో సీరియస్‌ క్యారెక్టర్‌ని తలపిస్తున్నాడని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇకపై అకీరాను అలా అనవద్దని సూచన కూడా చేశారు. కాగా రేణు పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

మరిన్ని వార్తలు