సల్మాన్ కేసులో తీర్పు, నేరం రుజువైతే ఏడేళ్లు జైలు

18 Jan, 2017 10:27 IST|Sakshi
సల్మాన్ కేసులో తీర్పు, నేరం రుజువైతే ఏడేళ్లు జైలు

జోద్పూర్ : అనుమతి లేకుండా మారణాయుధాలు కలిగి ఉండటం, వినియోగించటం లాంటి నేరాల కింద సల్మాన్ ఖాన్పై నమోదైన కేసులో ఈ రోజు(బుదవారం) జోద్పూర్ జిల్లా కోర్టు తీర్పు వెల్లడించనుంది. 1998 అక్టోబర్లో అనుమతి లేకుండా మారణాయుధాలు వినియోగించి వన్య ప్రాణులను వేటాడినందుకు గాను సల్మాన్పై నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసుల్లో సల్మాన్ నిర్దోషిగా రుజువవ్వగా ఇప్పుడు మూడో కేసులో తీర్పు వెలవడనుంది. అనుమతి లేకుండా .22 రైఫిల్, .32 రివాల్వర్ కలిగి ఉన్న కేసులో సల్మాన్పై నమోదైన కేసులో నేడు తీర్పు వెలువడనుంది.

తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరయ్యేందుకు సల్మాన్ ప్రత్యేక విమానంలో జోద్పూర్ చేరుకున్నారు. సల్మాన్తో పాటు ఆయన సోదరి అల్వీరా, కొంత మంది లాయర్లు ఉన్నారు. ఈ కేసులో సల్మాన్ దోషిగా రుజువైతే ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే  కేసుకు సంబందించి ఏప్రిల్ 2006లో ఒకసారి తరువాత ఆగస్టు 2007 కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించాడు సల్మాన్. తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

>