సాంగ్స్‌ టర్న్‌

13 Jul, 2018 00:36 IST|Sakshi
సమంత

‘రంగస్థలం, మహానటి’ చిత్రాల తర్వాత తెలుగులో సమంత నటిస్తున్న చిత్రం ‘యు టర్న్‌’. ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడలో ఘన విజయం సాధించిన ‘యు టర్న్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తి చేసుకొని, పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో సమంత న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆది పినిశెట్టి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. నరేన్, రవి ప్రకాష్, బిర్లా బోస్, ఛత్రపతి శేఖర్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: నికేత్‌.

మరిన్ని వార్తలు