బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

18 Jul, 2019 11:36 IST|Sakshi
బిగ్‌బాస్‌-3 కంటెస్టెంట్స్‌ వీరేనా..!

హైదరాబాద్‌: ప్రముఖ టీవీ యాంకర్‌ సావిత్రి బిగ్‌బాస్‌-3లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో కన్ఫర్మ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సావిత్ర పోస్టు చేసిన ఓ వీడియోలో తాను బిగ్‌బాస్‌-3లో పాల్గొంటున్నట్టు క్లారిటీ ఇచ్చారని సమాచారం. అయితే, ప్రస్తుతం ఆ పోస్ట్‌ను సావిత్రి తొలగించినట్టు తెలుస్తోంది. ఓ టీవీ చానెల్‌లో ‘సావిత్రక్క’గా ఫేమస్‌ అయిన శివజ్యోతి బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. 


యాంకర్‌ సావిత్రి

కంటెస్టెంట్స్‌ వీరేనా..!
నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌-3పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. వందరోజులపాటు సాగనున్న బిగ్‌బాస్‌-3 షోలో మొత్తం 15మంది కంటెస్టెంట్స్‌ పాల్గొననున్నారు. ఇప్పటికే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఎవరెవరు ఉండబోతునన్నారన్న దానిపై అనేక రకాల కథనాలు మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం చూసుకుంటే.. ఈసారి షోలో సావిత్రితోపాటు ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి, నటి హేమ, వరుణ్‌ సందేశ్‌, ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్‌ జాఫర్‌, ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షోలో ఎవరెవరు పాల్గొనబోతున్నది త్వరలోనే స్పష్టం కానుంది. ఇక, ఈ షో నిర్వాహకులు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించి.. లైంగికంగా వేధించారని జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఆరోపించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు