మంచి నటుడిని కోల్పోయాం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

6 Mar, 2020 23:30 IST|Sakshi

సీనియర్‌ కేరక్టర్ నటుడు జనార్ధన్ రావు శుక్రవారం కన్ను మూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని తన నివాసంలో మృతి చెందారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘమైన నట జీవితంలో ఎన్టీఆర్‌తో సహా పలు అగ్ర హీరోల చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాధించారు. ఆయన మృతిపట్ల ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సంతాపం తెలిపింది. తెలుగు సినిమా రంగం మంచి సీనియర్ నటుడిని కోల్పోయిందని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్‌, కార్యవర్గ సభ్యులు అన్నారు.

సీనియర్ నటుడు జనార్ధన్ రావు మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే స్పందించామని తెలిపారు. ‘మా’ యాక్టివ్‌ ప్రెసిడెంట్‌ బెనర్జీ మట్లాడుతూ.. జనార్ధన్ రావుతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఆయన మృతికి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ కార్యవర్గం సంతాపం తెలిపి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. 

మరిన్ని వార్తలు