యువ గాయని మృతి.. సూసైడ్‌గా అనుమానాలు!

25 Nov, 2019 10:26 IST|Sakshi

సియోల్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్‌ సింగర్‌ గూ హరా హఠాన్మరణం చెందారు. దక్షిణ కొరియాకు చెందిన కే-పాప్‌ బ్యాండ్‌ ‘కారా’ సభ్యురాలిగా, గాయనిగా పేరొందిన గూ హరా ఆదివారం సియోల్‌లోని తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా కనిపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె తన ఇంట్లో మరణించి ఉండటాన్ని పరిచయస్తులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె మృతికి కారణాలు తెలియదని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆరు నెలల కిందట కూడా ఆమె తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించారు. అప్పట్లో ఆత్మహత్యయత్నానికి ఆమె ప్రయత్నించినట్టు కథనాలు వచ్చాయి.

2008లో ‘కారా’ బ్యాండ్‌ గర్ల్‌గా గూ హరా సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పట్లో కారా బ్యాండ్‌ గ్రూప్‌ సెన్సేషనల్‌ పాపులారిటీని సొంతం చేసుకుంది. క్రమంగా ఈ బ్యాండ్‌ ప్రభ మసకబారింది. ఈ క్రమంలో గత ఏడాది రివేంజ్‌ పోర్నోగఫీ బారిన పడిన గూ హరా తన మ్యూజిక్‌ కెరీర్‌ను అర్ధంతరంగా ఆపేసింది. మాజీ ప్రియుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదిరించాడు. దీంతో అతన్ని హరా కోర్టుకు ఈడ్చింది. దీంతో కోర్టు అతనికి తాత్కాలిక జైలుశిక్ష విధించింది. ఈ వీడియోల కారణంగానే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా