మాహిష్మతీ రాజ్యమైనా అవి తప్పవు..

26 Jun, 2020 16:06 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో 11,489, తెలంగాణలో 11,364 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగానూ కోవిడ్‌ విజృంభణ ధాటిగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు కేసుల సంఖ్య 4.90 లక్షలకు చేరుకుంది. స్వీయ నియంత్రణ చర్యలే వైరస్‌ బారినపడకుండా మానవాళిని కాపాడలగలవని వైద్య నిపుణులు, పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దానిలో భాగంగా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు, విదేశాల్లో మాస్కులు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తున్నారు.

ఈక్రమంలో టాలీవుడ్‌ దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళీ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్‌, రానా తలపడే సన్నివేశాన్ని యునైటెడ్‌ సాఫ్ట్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూడియో టీమ్‌ ఎడిట్‌ చేసి.. భళ్లాల దేవ, మహేంద్ర బాహుబలి మాస్కులు ధరించినట్టుగా చూపించింది. మాహిష్మతీ రాజ్యంలో కూడా మాస్కులు తప్పనిసరి అని వీడియోలో పేర్కొంది. మాస్కులు మరువొద్దని సూచించింది. ఈ వీడియోను రాజమౌళీ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని ఆకాక్షించారు. యునైటెడ్‌ సాఫ్ట్‌ టీమ్‌కు అభినందనలు తెలిపాడు.
(చదవండి: ‘బాహుబలి’ ఖాతాలో మరో అవార్డు)

>
మరిన్ని వార్తలు