‘ఎన్టీఆర్‌’ సెట్‌కు ‘ఏఎన్నార్‌’!

15 Sep, 2018 16:57 IST|Sakshi

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలక్రిష్ణ, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్‌ రామ్‌, ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఎన్టీఆర్‌గా బాలకృష్ణ లుక్‌ను రివీల్‌ చేయించిన క్రిష్‌ ‘ఎన్టీఆర్‌’ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక ఏఎన్నార్‌ పాత్రలో నటిస్తున్న సుమంత్‌ .. ఎన్టీఆర్‌ షూటింగ్‌లో పాల్గొనబోతోన్నట్లు ట్వీట్‌ చేశారు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ పాత్రలో నటించనున్న కళ్యాణ్‌ రామ్‌ కూడా షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్‌చేయాలని ప్లాన్‌ చేస్తోంది చిత్రబృందం. 

మరిన్ని వార్తలు