సల్మాన్ 'కృష్ణజింక' కేసులో తీర్పు వాయిదా

5 Nov, 2014 13:05 IST|Sakshi
సల్మాన్ 'కృష్ణజింక' కేసులో తీర్పు వాయిదా

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింక' కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో సల్మాన్కు విధించిన శిక్ష అమలుపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. బ్రిటన్ వెళ్లేందుకు వీలుగా హైకోర్టు ఈ స్టే ఇచ్చింది.

రాజస్థాన్ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ, జస్టిస్ ఏకే గోయల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. తన తీర్పును వాయిదా వేసింది. 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్ ఖాన్, సోనాలి బెంద్రె, టబు, నీలమ్ తదితరులు రక్షిత జంతువైన కృష్ణజింకను వేటాడారంటూ అప్పట్లో కేసు నమోదైంది. 2006లో ఈ కేసులో సల్మాన్ఖాన్కు శిక్ష పడింది. హైకోర్టు గత సంవత్సరం ఆ శిక్షపై స్టే విధించింది.

>