ఇంకా లింగ వివక్ష: సీజేఐ

18 Dec, 2023 05:10 IST|Sakshi

బెంగళూరు: ప్రాంతీయ భేదాలకు అతీతంగా చాలా కుటుంబాల్లో నేటికీ లింగ వివక్ష సూక్ష్మ రూపంలో కొనసాగుతూనే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆవేదన వెలిబుచ్చారు. పైగా వాటిని ఎవరూ ప్రశ్నించరాదన్న ధోరణి కూడా గూడుకట్టుకుని పోయిందని ఆక్షేపించారు. ‘‘ఎవరు ఔనన్నా, కాదన్నా చేదు నిజం మాత్రం ఇదే.

పైగా న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛ కంటే వివాహ వ్యవస్థను నిలబెట్టడానికే ప్రాధాన్యతనిస్తూ రావడం ద్వారా దీనికి కొంతవరకు పరోక్షంగా ఆమోదముద్ర వేశాయి’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో ఆయన జస్టిస్‌ ఈఎస్‌ వెంకటరామయ్య శతాబ్ది స్మారక ప్రసంగం చేశారు. సంతానంలో ఒకరికి మించి పై చదువులు చదివించలేకపోతే అత్యధిక కుటుంబాల్లో ఆ అవకాశం కచి్చతంగా మగ సంతానానికే దక్కుతుంది. స్త్రీకి ఉండే ఆంక్షలు, ఒత్తిళ్లు మగవాడికి ఉండవన్నది కూడా వాస్తవం’’ అని సీజేఐ అన్నారు.

>
మరిన్ని వార్తలు