డిసెంబర్లో సింగం 3

20 Sep, 2016 10:55 IST|Sakshi
డిసెంబర్లో సింగం 3

దక్షిణాదిలో సీక్వల్స్గా రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ అవ్వటం చాలా అరుదు. అలాంటి అరుదైన సక్సెస్ను సొంతం చేసుకున్న హై టెంపో యాక్షన్ డ్రామా సింగం. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సింగం, సింగం 2 సినిమాలు తమిళ్తో పాటు తెలుగు లోనూ ఘనవిజయం సాధించాయి. అదే ఊపులో ఇప్పుడు సింగం 3ని తెరకెక్కించారు. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంఛలనాలు నమోదు చేస్తోంది.

సూర్య సరసన మరోసారి అనుష్క హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో శృతిహాసన్ కనిపించనుంది. తొలి రెండు భాగాలకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్కు బదులుగా మూడో భాగానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ్తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి నవంబర్లో ఆడియోను డిసెంబర్ 16న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.