సూర్య సినిమాలో మోహన్‌లాల్‌!

11 May, 2018 12:36 IST|Sakshi

ప్రస్తుతం ఓ మల్టిస్టారర్‌ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఒక పెద్ద హీరో, మరో స్టార్‌ హీరో సినిమాలో నటించడమో, అతిథి పాత్రలో మెప్పించడమో ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఈ పరిణామాలతో సినిమాకు ఒక కొత్తదనం వస్తోంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉంటే సినిమా రేంజ్‌ పెరిగిపోతుంది. అదే.. వేరే ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్‌ మరో ఇండస్ట్రీకి చెందిన స్టార్‌తో జతకడితే సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. 

మాలీవుడ్‌ స్టార్‌ కంప్లీట్‌ యాక్టర్‌ మోహన్‌లాల్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని లైకా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను కె.వి. ఆనంద్‌ డైరెక్ట్‌ చేయనున్నారు. ఇదివరకే సూర్య ఆనంద్‌ కాంబినేషన్‌లో వీడొక్కడే, బ్రదర్స్‌ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి హిట్‌ కొట్టాలని, ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా మోహన్‌లాల్‌ను ప్రత్యేక పాత్రకు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మోహన్‌లాల్‌ పాత్రే కీలకమని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ఎన్జీకే (NGK) మూవీలో నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా