అందులో ఏమాత్రం వాస్తవం లేదు: తాప్సీ

3 Feb, 2020 09:28 IST|Sakshi

నటి తాప్సీ పన్ను తాజాగా నటిస్తున్న చిత్రం ‘థప్పడ్‌(చెంప దెబ్బ అని అర్థం)’. ఈ సినిమా ట్రైలర్‌ గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ట్రైలర్‌లో అందరి ముందు భర్త చేత చెంపదెబ్బ తిన్న మహిళా.. ఆ తర్వాత భర్తతో క్షమాపణ చెప్పించడానికి చేసే న్యాయపోరాటం చూస్తే ఆత్మ గౌరవం ఉన్న మహిళాగా ఈ సినిమాలో తాప్సీ కనిపించనున్నారని అర్థంమైపోతుంది. దీంతో దర్శకుడు అనుభవ్‌ సిన్హా ‘థప్పడ్‌’ను ఇటీవలె విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన షాహీద్‌ కపూర్‌ ‘కబీర్‌ సింగ్‌’కు సమాధానంగా రూపొందిచారంటూ బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్యూలో తాప్పీని ఇదే విషయం అడగ్గా.. కబీర్‌ సింగ్‌కు సమాధానంగా ‘థప్పడ్‌’ రూపొందించ లేదని స్పష్టం చేశారు. ‘కబీర్‌ సింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా రూపొందించామనడంలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఒక సినిమాకు సమాధానంగా మేము సినిమా తీశామని అందరూ అనుకుంటున్నారని తెలియగానే బాధగా అనిపించింది. ‘థప్పడ్‌’ను దర్శకుడు అనుభవ్‌ సింగ్‌ ‘కబీర్‌ సింగ్‌’ విడుదలకు ముందే రచించారు. నేను ‘థప్పడ్‌’ను ఒక ట్రిగ్గర్‌గానే భావిస్తున్నాను’ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా భార్యభర్తల మధ్య ఉండే అనుబంధం, వారి మధ్య చోటు చేసుకునే సంఘటనలను గురించిన మరెన్నో విషయాలను ‘థప్పడ్‌’లోచూపించబోతున్నట్లు ఆమె చెప్పారు

ఇక ‘కబీర్‌ సింగ్‌’లో హీరోయిన్‌, హీరో చేతిలో పలుమార్లు చెంపదెబ్బ తిన్నా కూడా సర్థుకుపొయినట్లుగా చూపించారు. దీనిపై తాప్సీ మట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇదేం కొత్త విషయం కాదు. ‘కబీర్‌ సింగ్‌’ ఇప్పుడు తాజాగా వచ్చింది కాబట్టి అందరూ ‘థప్పడ్‌’ను దానికి సమాధానంగా భావిస్తున్నారు’ అని అన్నారు. అదేవిధంగా ‘నేను ఎప్పటికీ ‘కబీర్‌ సింగ్‌’ అలాంటి సినిమాల్లో నటించను. ఈ సినిమా విడుదలై తీవ్ర విమర్శల్లో సైతం కలెక్షన్‌లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌ హీట్‌ సాధించింది.. ఇందుకు చిత్ర నిర్మాతలకు, బృందానికి నా శుభకాంక్షలు’ అని అన్నారు. అయితే ‘కబీర్‌ సింగ్‌’లో నటించడానికి ఒకవేళ తనని సంప్రదించి ఉంటే నటించడానికి ఒప్పుకునే దానిని కాదని తాప్సీ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు