అల్లుడి కోసం ఒప్పుకున్న వెంకీ

4 Oct, 2015 12:09 IST|Sakshi
అల్లుడి కోసం ఒప్పుకున్న వెంకీ

'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే ఓ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకుల చెప్పిన కథలకు ఓకె చెప్పిన వెంకీ, ఎవరు ముందుగా కథ రెడీ చేస్తే వారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట.

అయితే ఈ గ్యాప్లో నాగచైతన్య చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు వెంకీ. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న చైతూ ఆ సినిమా పూర్తవ్వగానే మళయాల సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి సీనియర్ స్టార్ వెంకటేష్ అంగీకరించాడు. తన మేనల్లుడు నాగచైతన్య స్వయంగా అడగటంతో ఈ క్యారెక్టర్ చేయడానికి వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడు.

ఒరిజినల్ వర్షన్లో అనంత్ నాగ్ నటించిన పాత్రలో తెలుగులో వెంకీ దర్శనమివ్వనున్నాడు. 'కార్తీకేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, దిశాపటానీ, అనుపమా పరమేశ్వరన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తెలుగు రీమేక్కు మజ్ను అనే టైటిల్ను ఫైనల్ చేశారు.