ఓకేనా? సెట్‌ చేశారా?

18 Nov, 2017 11:48 IST|Sakshi

సాక్షి, తమిళ సినిమా: ఓకేనా..సెట్‌ చేశారా? ఏమిటీ అర్థం పర్థం లేని రాతలు అనుకుంటున్నారా? మీరలా అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. అయితే ఏదో విషయం ఉంటుందనే ఆలోచన కూడా వస్తే బాగుంటుంది. ఇక సోదిలోకి వెళ్లకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. దాదాపు దశాబ్దన్నర ముందు తెరపైకి వచ్చిన చిత్రం సామి. హరి దర్శకత్వంలో విక్రమ్, త్రిష జంటగా నటించిన ఆ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్‌ అయ్యింది. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఆ చిత్రానికి తాజాగా రెండవ భాగం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమీస్‌ పతాకంపై శిబు తమీస్‌ నిర్మిస్తున్న ఇందులో విక్రమ్‌ సరసన త్రిష, కీర్తీసురేశ్‌ నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయిన కొద్దిరోజులకే త్రిష చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చింది.

చిత్ర యూనిట్‌తో సెట్‌ కాకపోవడం కారణంగానే సామి 2 నుంచి తప్పుకున్నట్లు త్రిష పేర్కొన్నా, అందులో తన పాత్ర కంటే కీర్తీసురేశ్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నందునే ఈ చెన్నై చిన్నది వైదొలగినట్లు ప్రచారం హోరెత్తింది. ఇదంతా పాత విషయమే. కొత్తగా ప్రచారం అవుతున్నదేమిటంటే, నటుడు విక్రమ్‌ ఇటీవల తన కూతురు పెళ్లి పనులతో బిజీగా ఉండి సామి 2 చిత్రం గురించి పెద్దగా పట్టించుకోలేదని, ఆ వేడుక కాస్త పూర్తి కావడంతో చిత్రంపై దృష్టి పెట్టిన విక్రమ్‌ ఇటీవల తనే స్వయంగా త్రిష ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చచెప్పి సామి2 లో నటించేలా సెట్‌ చేసినట్లు ప్రచారం వైరర్‌ అవుతోంది. అయితే త్రిష వర్గం మాత్రం ఒక్కసారి కాదనుకుంటే మళ్లీ నటిస్తారా? సామి2 చిత్రంలో త్రిష చేయడం లేదు అని అంటున్నట్లు సమాచారం. ఈ విషయంలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకుంటే త్రిష పాత్రలో సామి2 యూనిట్‌ ఇంకా వేరే నటిని ఎంపిక చేయలేదు. చిత్ర షూటింగ్‌ మాత్రం కేరళలో నిరాటంకంగా జరుపుకుంటోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా