రెజీనాకు నిశ్చితార్థం జరిగిందా?

26 Oct, 2016 01:36 IST|Sakshi
రెజీనాకు నిశ్చితార్థం జరిగిందా?

నటి రెజీనాకు వివాహ నిశ్చితార్థం జరిగిందా? తాజాగా చిత్ర వర్గాల్లో జరుగుతున్న పెద్ద చర్చ ఇదే. కోలీవుడ్‌లో నిరాదరణకు గురై టాలీవుడ్‌ను ఆశ్రయించిన నటి రెజీనా. ప్రస్తుతం అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇక్కడి బ్యూటీకి చేతి నిండా చిత్రాలున్నాయి. ఇలాంటి పరిస్థితిలో తన చర్యలతో రెజీనా పెద్ద కలకలానికే కేంద్రబిందువుగా మారారు. ఈ జాన ఒక ఆడ మగ చేతులు మాత్రమే కనిపించే లాంటి ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
అందులో తను పేర్కొంటూ ఈ శుభతరుణంలో మీ అందరి ఆశీస్సులు కావాలి. ఇలా జరగడం కాస్త విచారించదగ్గ విషయయే. అతను ఎవరన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి మీకు ఉంటుందని తెలుసు. అయితే ఆ విషయం గురించి త్వరలోనే వెల్లడిస్తాను. నిజానికి ఇలాంటి సంతోషకరమైన కార్యం జరుగుతుందని నేనూ హించలేదు. అనే వ్యాఖ్యల్ని పొందుపరచిన రెజీనా కొద్ది సేపటికే ఆ ఫొటోనూ, తన వ్యాఖ్యలను తన సైట్ నుంచి తొలగించారు. అయినా సోషల్ మీడియాలో రెజీనా పోస్ట్ చేసిన ఫొటో, తాను పేర్కొన్న భావాలు చాలా వేగంగా చక్కర్లు కొడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే రెజీనా క్రికెట్ క్రీడా శిక్షకుడు విక్రమ్ ఆదిత్యతో తీసుకున్న సెల్ఫీ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
 
ఇక పోతే రెజీనా చాలా కాలంగా ఒక తెలుగు యువ నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నారన్న వదంతులు దొర్లుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో రెజీనా ఆడ మగ చేతులు కలిపిన ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఏమిటీ? మళ్లీ వెంటనే దాన్ని తొలగించడం ఏమిటీ? అసలు ఈ అమ్మడి వివాహ నిశ్చితార్థం జరిగినట్టా? లేనట్టా? లేక తమిళ చిత్ర ప్రచారంలో ఈ తంతు ఒక భాగమా? అన్న రకరకాల అభిప్రాయాలతో సినీ వర్గాలు అయోమయంలో పడ్డారు. కాగా రెజీనా ప్రస్తుతం తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో నెంజం మరప్పదిల్లై, నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా శరవణన్ ఉరుక్క భయమే, అధర్వతో జెమినీగణేశనుమ్ సురళీరాజావుమ్, మానగరం, రాజతందిరం 2 చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌