చెట్టుకు విషమిచ్చి చంపారు!

28 Jul, 2016 11:25 IST|Sakshi
చెట్టుకు విషమిచ్చి చంపారు!

చెన్నై: తమిళనాడులోని పెరుంగుడి ప్రాంతానికి చెందిన ప్రజలు ఇప్పుడు ఓ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. వారి పోరాటం ఓ మర్రి చెట్టు గురించి. వందేళ్ల మర్రిచెట్టు ఒకటి ఇటీవల ఉన్నట్లుండి ఎండిపోసాగింది. ఏడాది క్రితం వరకు ఎంతో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దాని ఊడలు ఒక్కొక్కటిగా ఎండిపోసాగాయి. మామూలుగానైతే చెట్టు వయసైపోయిందని భావించేవారు గానీ.. దానితో అనుబంధం ఉన్న చుట్టుపక్కలవారు మాత్రం అలా భావించలేదు. దాన్ని కావాలనే విషమిచ్చి ఎండిపోయేలా చేశారని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగారు.

ఆ చెట్టు సరిగ్గా ఓ ఐటీ పార్క్కు ఎదురుగా ఉండటంతో.. అది అడ్డుగా ఉందని భావించి వారే దానిపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. 

ఏడాది క్రితం

మరిన్ని వార్తలు