రెండేళ్ల తర్వాత 11 మంది భారతీయులకు విముక్తి

3 Jul, 2016 17:10 IST|Sakshi

ఢిల్లీ: రెండేళ్లపాటూ నైజీరియాలో బంధీలుగా ఉన్న 11 మంది భారతీయులకు విముక్తి లభించింది. వీరిలో మహబూబ్నగర్కు చెందిన ఇంజినీర్ మనోజ్ కుమార్ కూడా ఉన్నారు. బోట్లోని ఇంజన్ సాంకేతిక లోపంతో నైజీరియా సీవే లో వీరందరూ చిక్కుక్కున్నారు. డబ్బుకోసం నైజీరియన్ కోస్ట్ గార్డ్స్ వారిని బంధించినట్టు బాధితులు తెలిపారు.

భారత్కు చెందిన నితిన్ సందేశ్ కంపెనీ, స్ట్రెర్లింగ్ ఆయిల్ రిసోర్సెస్ లిమిటెడ్ సహకారంతో స్వదేశానికి వచ్చామని బాధితులు పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడి స్వదేశానికి తీసికొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మనోజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు