‘పాత’ నోట్ల లెక్కింపు సాగుతోంది: ఆర్బీఐ

12 Feb, 2018 02:50 IST|Sakshi

న్యూఢిల్లీ: రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్ల లెక్కింపు ఇంకా సాగుతోందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. నోట్ల రద్దు జరిగిన 15 నెలలు గడిచిన తర్వాత ఈ ఆశ్చర్యకర ప్రకటన చేసింది. రద్దైన నోట్ల వివరాలు తెలపాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి కోరడంతో ఈ మేరకు ఆర్బీఐ స్పందించింది. 2017 జూన్‌ 30 నాటికి రూ.15.28 లక్షల కోట్ల నోట్లు (99 శాతం) వచ్చాయని వెల్లడించిన ఆర్బీఐ.. లెక్కింపు ఎప్పుడు పూర్తవుతుందో తెలపాలని కోరగా ప్రస్తుతం ప్రక్రియ వేగంగా జరుగుతోందంటూ సమాధానం దాటవేసింది. నోట్ల ‘కచ్చితత్వం, వాస్తవికత’ తెలుసుకునే ప్రక్రియ కొనసాగుతోందని.. ఇందుకు 59 అత్యాధునిక కరెన్సీ వెరిఫికేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ మెషీన్లు వినియోగిస్తున్నామని తెలిపింది.

మరిన్ని వార్తలు