కశ్మీర్‌లో 18 కి.మీ. సొరంగ మార్గం

15 Feb, 2016 20:49 IST|Sakshi
కశ్మీర్‌లో 18 కి.మీ. సొరంగ మార్గం
శ్రీనగర్: కశ్మీర్‌లోని గురెజ్ కేంద్రంగా ఒక పొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) కేంద్రానికి సమర్పించింది. దీనికి అవసరమయ్యే వ్యయం రూ. 9,000 కోట్లుగా అంచనా. బండిపొర జిల్లాలో ఉన్న గురెజ్‌లో శీతాకాలంలో కురిసే అత్యధిక మంచు కారణంగా మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతున్నాయి.

ఈ పరిస్థితిని నివారించి ఏడాది పొడవునా గురెజ్  లోయలోని మిగిలిన ప్రాంతాలన్నీ  సంబంధాలు కలిగి ఉండేలా చేయాలన్నదే ఈ నిర్మాణం వెనుక ముఖ్య ఉద్దేశం. 
ఈ సొరంగ రోడ్డు మార్గం పొడవు 18 కి.మీ. కేంద్రం నుంచి దీనికి అనుమతి లభిస్తే దేశంలోనే పొడవైన సొరంగ రోడ్డు మార్గంగా ఇది రికార్డులకెక్కుతుంది. 
 
మరిన్ని వార్తలు