భారత్-పాక్ సరిహద్దులో భూకంపం

1 Oct, 2016 15:09 IST|Sakshi

కశ్మీర్ : భారత్-పాకిస్తాన్ సరిహద్దులో శనివారం భూకంపం సంభవించింది. భూప్రకంనలు తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు అయింది.  పాకిస్తాన్లోని తూర్పు స్వాత్ వ్యాలీలో భూమి కంపించినట్లు యూఎఓస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అలాగే కశ్మీర్ వ్యాలీలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 1.34 గంటలకు భూకంపం వచ్చింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కాగా పాక్ రాజధాని ఇస్లామాబాద్, ఖైబర్- పఖ్తుంఖ్వా (కేపీ) ప్రావిన్స్తో పాటు పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు ప్రకంపనలు వచ్చినట్లు ప్రాంతీయ విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది.

 

మరిన్ని వార్తలు