గోరఖ్‌పూర్‌ విషాదం : ఏడుమందిపై చార్జిషీట్‌

28 Oct, 2017 09:00 IST|Sakshi

సాక్షి, గోరఖ్‌పూర్‌ : గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రి ఘటనలో చిన్నారుల మృతికి సంబంధించి 7 మందిపై పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఆగస్టు 10, 11 తేదీల్లో బీఆర్‌డీ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్‌ రాజీవ్‌ మిశ్రా భార్య డాక్టర్‌ పూర్ణిమా మిశ్రా (సీనియర్‌ హోమియో మెడికల్‌ ఆఫీసర్‌), డాక్టర్‌ సతీష్‌ (అనస్తీషియా స్పెషలిస్ట్‌), గజేంద్ర జైశ్వాల్‌ (చీఫ్‌ ఫర్మాసిస్ట్‌),  సుధీర్‌ పాండే, సంజయ్‌ త్రిపాఠి, ఉదయ్‌ ప్రతాప్‌ (ఆసుపత్రి ఉద్యోగులు), మనీష్‌ భంగడారి (పుష్పా సేల్స్‌ ప్రొప్రయిటర్‌, ఆక్సిజన్‌ సరఫరదారు)లపై పోలీసలు శుక్రవారం చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇందులో డాక్టర్‌ పూర్ణిమా మిశ్రా, గజేంద్ర జైశ్వాల్‌, ఇతర ఉద్యోగులను ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి తొలింగించింది.

డాక్డర్‌ పూర్ణియా, ఇతర ఉద్యోగలను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 25న అనుమలు జారీ చేసింది. మాజీ ప్రిన్సిపాల్‌ రాజీవ్‌ మిశ్ర, డాక్టర్‌ ఖఫీల్‌ ఖాన్‌లను విచారణ అనుమతులు కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్వెస్టిగేటింగ్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు