'గుజ్రాల్‌ సలహా వింటే సిక్కుల ఊచకోత జరిగేది కాదు'

6 Dec, 2019 02:15 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐకే గుజ్రాల్‌ సలహా నాటి కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు విని ఉంటే, 1984 నాటి సిక్కుల ఊచకోత చోటు చేసుకునేదే కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ సంస్మరణ సభలో గురువారం మన్మోహన్‌ మాట్లాడారు. ‘1984లో ఆ విషాదకర సంఘటన జరిగిన రోజే..  గుజ్రాల్‌నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు వద్దకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, తక్షణమే ఆర్మీని మోహరిస్తే మంచిదని పీవీకి సలహా ఇచ్చారు.

ఆ సలహాను పీవీ పాటించి ఉంటే, సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు’ అని మన్మోహన్‌ వ్యాఖ్యానించారు. మన్మోహన్‌ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. అంత చెడ్డవాడైన పీవీ కేబినెట్‌లో ఆరి్థకమంత్రిగా ఎందుకు పనిచేశారని మన్మోహన్‌ను ప్రశి్నంచింది. ఇప్పటికైనా వాస్తవం బయట పెట్టినందుకు మన్మోహన్‌కు కృతజ్ఞతలని ఐకే గుజ్రాల్‌ కుమారుడు అకాలీదళ్‌ నేత నరేశ్‌ గుజ్రాల్‌ వ్యాఖ్యానించారు. ఊచకోత బాధ్యతను రాజీవ్‌ గాంధీ నుంచి తప్పించేందుకు చేసిన వ్యాఖ్య ఇదని శిరోమణి అకాలిదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ పేర్కొన్నారు. మన్మోహన్‌ వ్యాఖ్యలపై స్పందించేందుకు కాంగ్రెస్‌ నిరాకరించింది.

మరిన్ని వార్తలు