భారత్‌లో జాక్వెస్ లెమన్స్ వాచ్‌లు

20 Apr, 2016 08:10 IST|Sakshi
భారత్‌లో జాక్వెస్ లెమన్స్ వాచ్‌లు

ధరలు రూ.6,800 నుంచి రూ.45,000 రేంజ్‌లో
హైదరాబాద్: ఆస్ట్రియాకు చెందిన జాక్వెస్ లెమన్స్ వాచ్‌లను స్కైబర్డ్ ఇన్‌కార్పొరేషన్ భారత్‌లోకి తెస్తోంది. జాక్వెస్ లెమన్స్ వాచ్‌లకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ హక్కులు తమకే ఉన్నాయని స్కైబర్డ్ ఇన్‌కార్పొ ఒక ప్రకటనలో తెలిపింది. 120 దేశాల్లో ఈ బ్రాండ్ వాచ్‌లు విరివిగా అమ్ముడవుతున్నాయని స్కైబర్డ్ హెడ్(బిజినెస్ డెవలప్‌మెంట్) సోనియా దాస్వాని పేర్కొన్నారు.  భారత్‌లో ఏడు రకాల కలెక్షన్లలో వీటిని అందిస్తున్నామన్నారు.  

పురుషుల కోసం ఆటోమేటిక్, స్పోర్ట్స్, క్లాసిక్ మ్యాన్, హైటెక్ సిరామిక్ మ్యాన్, మహిళలకు క్లాసిక్ ఉమెన్, హైటెక్ సెరామిక్ ఉమెన్, లా ప్యాసన్ కలెక్షన్లలో వీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. వీటి ధరలు రూ.6,800 నుంచి రూ.45,000 రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు