తాజ్‌మహల్ చెంత దాహం.. దాహం

16 Apr, 2016 13:47 IST|Sakshi
తాజ్‌మహల్ చెంత దాహం.. దాహం

దేశంలోనే పర్యాటక స్థలాల్లో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో వేడి, దాహం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. శుక్రవారం నాడు అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. శనివారం ఉదయం కొంత మబ్బులు కనిపించినా, వేడి ఎక్కువగానే ఉంది. వడగాలులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయని ఆగ్రాలోని పలివల్ పార్కులో తరచు మార్నింగ్ వాక్ చేసే ప్రదీప్ భాయ్ చెప్పారు. ఈ ఎండల తీవ్రత కారనంగా స్కూళ్లకు వేసవి సెలవులు త్వరగా ఇవ్వాలని నరేష్ పరస్ అనే మరో వ్యక్తి చెప్పారు.

తాజ్‌మహల్‌ను సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు కూడా ఈ వేడి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. ప్రధానంగా తాజ్ ఎదురుగా ఒక పాలరాతి బెంచి ఉంటుంది. దానిమీద కూర్చుని వెనకాల తాజ్‌మహల్ కనిపించేలా ఫొటోలు తీయించుకుంటారు. ఇప్పుడు దానిమీద కూర్చోవాలంటే వేడెక్కిపోయి చాలా ఇబ్బందిగా ఉంటోందట. తాగునీరు కూడా చాలా సమస్యగా మరిందని పర్యాటకులు వాపోతున్నారు. వీళ్ల దాహం తీర్చడానికి ఆగ్రాలో తగినన్ని నీళ్లు కూడా లేవు. గత 15 రోజులుగా ఇక్కడ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. యమునా నదిలో నీటి అందుబాటు చాలా పడిపోయిందని వాటర్ వర్క్స్ అధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు