‘మా వినయాన్ని పిరికితనమనుకున్నారు..’

26 Feb, 2019 14:48 IST|Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం తెల్లవారు జామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపా​యి. ఈ సందర్భంగా భారత సైన్యం ట్వీట్‌ చేసిన ఓ పద్యం ఇప్పుడు తెగ వైరలవుతోంది.

‘శత్రువు ముందు వినయ విధేయతలు చూపిస్తే.. వాడు మనల్ని పిరికివాడుగా భావిస్తాడు. పురాణాల్లో కౌరవులు పాండవుల గురించి ఎలా తక్కువ అంచనా వేశారో.. అలానే మన శత్రువు కూడా మన సహనాన్ని పిరికితనంగా భావించాడు. అయితే ఫలితం ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించి ఉండడు’ అంటూ ‘ఆల్వేస్‌రెడి’ అనే హాష్‌ట్యాగ్‌తో పోస్ట్‌ చేసిన ఈ పద్యం ఇప్పుడు తెగ వైరలవుతోంది. అంతేకాక మనం శక్తివంతులమని, యుద్ధంలో గెలుపు మనదేనని శత్రువుకు అర్థమైతేనే  శాంతి చర్చలు ఫలిస్తాయంటూ ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

బాలాకోట్, చాకోటి, ముజ‌ఫ‌రాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్‌-200 యుద్ధ విమానాలతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.. సర్జికల్‌ స్ట్రైక్‌ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. 

మరిన్ని వార్తలు