పిల్లల్నీ విడిచిపెట్టరా..?

25 Jan, 2018 15:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింలు, దళితులను మట్టుబెట్టిన వారు ఇప్పుడు మన పిల్లల్నీ విడిచిపెట్టడం లేదంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గురుగ్రామ్‌లో చిన్నారులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. పద్మావత్‌ మూవీకి వ్యతిరేకంగా గురుగ్రామ్‌లో నిరసనకారులు స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ ‘ముస్లింలు, దళితులను ఊచకోత కోసిన వారు ఇప్పుడు మన పిల్లలపై రాళ్లు రువ్వుతున్నారు..మన ఇళ్లలోకి దూసుకొస్తున్నారు..ఇక ఇప్పుడు మనం మౌనం వీడి గొంతెత్తాల్సి ఉంద’ని వ్యాఖ్యానించారు. సమాజాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం తలెత్తిందన్నారు.

రిపబ్లిక్‌ డే వేడుకల నేపథ్యంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ మాట్లాడారు. స్కూల్‌ చిన్నారులపై రాళ్లు విసరడం సిగ్గుచేటని, నిందితులకు రావణుడికి రాముడు ఇచ్చిన శిక్ష కంటే కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారులపై హింసను ఏ మతం ప్రోత్సహిస్తుందని కేజ్రీవాల్‌ నిలదీశారు. 

మరిన్ని వార్తలు