అవసరమైతే అమిత్‌ షాతో మాట్లాడుతాం

20 Oct, 2019 05:10 IST|Sakshi
బంగ్లాదేశ్‌ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ జలాల్లోకి అక్రమంగా వెళ్లినందుకు గురువారం అరెస్టయిన భారతీయ మత్స్యకారుడిని నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని బంగ్లాదేశ్‌ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఇటీవల ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను ఓ బంగ్లాదేశీ సరిహద్దు భద్రతా బలగాలు తుపాకీతో కాల్చిచంపడం ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అవసరమైతే దీనిపై తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడుతానని వెల్లడించారు. ‘బలగాల మధ్య సమన్వయలోపం కారణంగానే సరిహద్దు భద్రతాదళం(బీఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌ విజయ్‌ సింగ్‌ మరణానికి దారి తీశాయి’ అని అసదుజ్జమాన్‌ చెప్పారు.

>
మరిన్ని వార్తలు