చేప గాలానికి.. 22 అడుగుల ‘తిమింగలం’

4 Jan, 2020 09:44 IST|Sakshi
ఐటీఐ ప్రాంగణంలో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం

వ్యర్థ వస్తువులతో తయారీ

గిన్నిస్‌ రికార్డ్‌ లక్ష్యంగా శ్రమించిన ఐటీఐ విద్యార్థులు 

బరంపురం: పనికిరాని వ్యర్థ వస్తువులతో చేప గాలానికి  22 అడుగుల తిమింగలం తయారు చేసి బరంపురం ఐటీఐ విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ 22 అడుగుల తిమింగలం సందర్శకులను  ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్‌ రజత్‌ కుమార్‌ పాణిగ్రహి శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ గిన్నిస్‌ బుక్‌ అఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లక్ష్యంతో ఐటీఐ కళాశాలలో చదువుతున్న ఫిట్టర్, వెల్డర్, పెయింటర్‌ ట్రేడ్‌లకు చెందిన 25 మంది విద్యార్థులు 40 రోజుల పాటు శ్రమించి వ్యర్థ పదార్థాలతో చేప గాలానికి 22 అడుగుల తిమింగలం తయారు చేసి రికార్డు సృష్టించారని చెప్పారు. ఇది సుమారు 400 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే విద్యార్థులు 70 అడుగుల  గిటార్‌ను తయారు చేసి అసియా బుక్‌ అఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారన్నారు. ప్రస్తుతం ఈ చేప గాలానికి   చిక్కిన 22 అడుగుల తిమింగలం ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ నేపథ్యంలో బరంపురం ఐటీఐ విద్యార్థులకు గిన్నిస్‌ బుక్‌ అఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తప్పక స్థానం దక్కుతుందని ప్రిన్సిపాల్‌ రజత్‌ పాణిగ్రహి ఆశాభావం వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు