చార్జీల పెంపునకు ఇదా సమయం!

18 Aug, 2018 05:58 IST|Sakshi

సాక్షి బెంగళూరు: కేరళ, కర్ణాటకల్లో వరద సమయాల్లోనూ ప్రైవేట్‌ విమానయాన సంస్థలు వ్యాపార దృష్టితో ఉండటం శోచనీయమని కేంద్ర మంత్రి సదానంద మండిపడ్డారు. సాధారణ వేళల్లో బెంగళూరు–మంగళూరు మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 4 వేలుంటే, ఇప్పుడు రూ.18 వేలకు తాకాయని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు, రైళ్లు సహా మంగళూరు, కేరళకు వెళ్లే అన్ని రవాణా మార్గాలు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో విమానయానం ఒక్కటే ప్రజలకు ముందున్న ప్రయాణ మార్గమని, దీన్ని ఆసరాగా చేసుకుని చాలా ప్రైవేటు సంస్థలు చార్జీలను అమాంతం పెంచేశాయి.

మరిన్ని వార్తలు