ఉన్నతాధికారులపై దాడి చేసిన ట్రైనీ కానిస్టేబుళ్లు

2 Nov, 2018 17:35 IST|Sakshi

పాట్నా : లా అండ్‌ ఆర్డర్‌ని కాపాడాల్సిన పోలీసులే.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమ సహోద్యోగి మృతికి కారణమయిన ఓ కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను చితక్కొట్టడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాలు ట్రైనింగ్‌లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌కి డెంగ్యూ వచ్చింది. దాంతో సదరు మహిళ సెలవు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. కానీ వారు అంగీకరించలేదు. దాంతో ఆ మహిళా కానిస్టేబుల్‌ మరణించింది. సెలవు మంజూరు చేయకపోవడం వల్లే సదరు ఉద్యోగిని మరణించిందని తేలిసి ఆగ్రహం చెందిన మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారుల మీద దాడికి దిగారు. అసభ్య పదజాలంతో తిడుతూ.. పదునైన ఆయుధాలతో దాడి చేయడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అంతటితో ఊరుకోక కొన్ని ప్రభుత్వ వాహనాలతో పాటు ఫర్నిచర్‌ని కూడా ధ్వంసం చేశారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో బిహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ దృష్టికి చేరింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా నితిష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు