సీఎం మార్ఫింగ్‌ ఫొటో షేర్‌ చేసినందుకు...

12 May, 2019 16:14 IST|Sakshi

కోల్‌కత : వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఫొటో షేర్‌ చేసినందుకు ఓ బీజేపీ కార్యకర్త అరెస్టయ్యారు. మమత పరువుకు భంగం కలిగించారంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రియాంక శర్మను మే10న పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం న్యూయార్క్‌లో మెట్‌గాలా ఫ్యాషన్‌ షో - 2019 జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనస్‌ పింక్‌ కార్పెట్‌పై నడిచారు. సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే, ప్రియాంక ఫొటోతో మమతా బెనర్జీ చిత్రాన్ని మార్పింగ్‌ చేసి కొందరు ఔత్సాహికులు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
(బెస్ట్‌ కపుల్‌...  వరస్ట్‌ లుక్‌)

దీనిని ప్రియాంక శర్మ కూడా షేర్‌ చేశారు. అయితే, మమత పరువుకు భంగం కలిగించారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పరువు నష్టం (ఐపీసీ సెక్షన్‌ 500), అభ్యంతరకర మెసేజ్‌లు (66 ఏ-ఐటీ చట్టం) కింద కేసులు నమోదు చేశారు. కోర్టు ఆమెకు14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. కాగా, తన కూతురు బీజేపీకి చెందిన వ్యక్తి కావడంతో అరెస్టు చేశారని ప్రియాంక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, 6 నెలల క్రితమే బీజేపీలో చేరిన ప్రియాంక హౌరా జిల్లా క్లబ్‌ సెల్‌ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు.

ప్రియాంక శర్మ

>
మరిన్ని వార్తలు