'మహా'లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ కసరత్తు

24 Oct, 2014 09:54 IST|Sakshi
'మహా'లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ కసరత్తు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 27న బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. కేంద్ర మంత్రి నితీన్ గడ్కారీ ఇప్పటికే తాను సీఎం పదవికి రేసులో లేనని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షడు దేవేంద్ర పడ్నవిస్ సీఎం పదవిని చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా దేవేంద్ర వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదికాక  కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ముంబై వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఎంపిక అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.  

కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితీన్ గడ్కారీని సీఎంగా ఎంపిక చేయాలని మహారాష్ట్రలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో తాను కేంద్ర మంత్రిగా న్యూఢిల్లీలోనే ఉండాలని భావిస్తున్నానని... తిరిగి ముంబై వచ్చేందుకు అంత సుముఖుంగా లేనట్లు నితీన్ గడ్కారీ గురువారం వెల్లడించారు.  అక్టోబర్ 15న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 సీట్లు గల మహారాష్ట అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 146 సీట్లు రావాలన్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు