మావోయిస్టుల దాడి : ఆర్మ్ డ్ జవాన్ మృతి

10 Dec, 2015 11:29 IST|Sakshi

రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని ఆర్మ్డ్ శిబిరంపై మావోయిస్టులు గురవారం దాడి చేశారు. ఈ దాడిలో ఛత్తీస్గఢ్ ఆర్మీడ్ ఫోర్స్కు చెందిన జవాన్ అశ్వీని సింగ్ రాజ్పుట్ మరణించాడు.  ఈ మేరకు నారాయణపూర్ జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించారు.  ఈ రోజు తెల్లవారుజామున ఆర్మ్ డ్ శిబిరం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేసి కాల్పులకు దిగారని చెప్పారు.

వెంటనే అప్రమత్తమైన ఆర్మీడ్ సిబ్బంది ఎదురుకాల్పులకు జరిపారు.   ఈ కాల్పుల్లో జవాన్ అశ్వీన్ మరణించారని తెలిపారు. అనంతరం మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారని వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు జవాన్లు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారని మీనా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు