సీబీఎస్‌ఈ ‘గణితం’లో రెండు పేపర్లు

12 Jan, 2019 05:57 IST|Sakshi

2020, మార్చి నుంచి అమలు  

న్యూఢిల్లీ: పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. గణితం పరీక్షను స్టాండర్డ్, బేసిక్‌ అని రెండు విభాగాలుగా విడగొట్టి నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ప్రకటించింది. విద్యార్థులు తమ సామర్థ్యానికి అనుగుణంగా కఠినంగా ఉండే గణితం–స్టాండర్డ్‌ లేదా సులభంగా ఉండే గణితం–బేసిక్‌ పేపర్‌ను ఎంచుకోవచ్చు. 2020 మార్చి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఈ 2 పేపర్లకు సంబంధించి పాఠ్యాంశాలు, బోధన, అంతర్గత మదింపులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు