లైంగిక దాడి కేసులపై కేంద్రం సంచలన నిర్ణయం

12 Dec, 2019 15:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దిశ, ఉన్నావ్‌ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక దాడి, పోక్సో కేసులన్నింటిపై ఆరు నెలల్లోగా విచారణ ముగిసేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరికీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ గురువారం లేఖ రాశారు. ఈ తరహా కేసులన్నింటిలో విచారణను రెండు నెలల్లోగా పూర్తిచేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆదేశించారు. లైంగిక దాడి కేసుల సత్వర విచారణకు దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 700 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులున్నాయని, తాజా కోర్టులతో వీటి సంఖ్య 1723కు చేరుతుందని చెప్పారు. దిశ హత్యాచార ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను హైదరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు