‘త్వరలో డ్రైవింగ్‌ లైసెన్స్‌–ఆధార్‌ లింక్‌’

8 Feb, 2018 04:19 IST|Sakshi

న్యూఢిల్లీ: డ్రైవింగ్‌ లైసెన్స్‌లను ఆధార్‌తో అనుసంధానించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు బుధవారం ఓ కమిటీ తెలిపింది. రహదారి భద్రతపై గతంలో కోర్టు సుప్రీంకోర్టు మాజీ జడ్టి జస్టిస్‌ కేఎస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తన నివేదికను బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

గత నవంబరు 28న తాము రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శితో సమావేశం నిర్వహించామనీ, నకిలీ లైసెన్స్‌లను ఏరివేసేందుకు ఆధార్‌ అనుసంధానాన్ని త్వరలోనే చేపట్టనున్నట్లు సదరు అధికారి తమకు చెప్పారని కమిటీ పేర్కొంది. అందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) రూపొందిస్తోందంది. సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల్లోనూ డ్రైవింగ్‌ లైసెన్స్‌లను ఆధార్‌తో అనుసంధానించే పనిని కేంద్రం మొదలుపెడుతుందని కమిటీ తన నివేదికలో చెప్పింది. 

మరిన్ని వార్తలు