ఇదో చాయ్‌ చమక్కు..33 యేళ్ళుగా

12 Jan, 2019 11:57 IST|Sakshi

చాయ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..అందులోనూ గజ గజ లాడించే చలిలో గరం గరం చాయ్‌ పడితే...ఆ మజాయే వేరు కదా.. కానీ కేవలం ఒక్క చాయ్‌తోనే బతికేయడం సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించిందో మహిళ. ఇలా ఒకటా..రెండా ఏకంగా 30యేళ్లకు పైగా కేవలం చాయ్‌ మాత్రమే తాగి మనుగడ సాగించింది. 

ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లా, బరడియ గ్రామంలో నివసించే పిల్లి దేవి (44) కథ ఇది. కారణం ఏమిటో తెలియదు గానీ  పదకొండేళ్ల వయసులోనే భోజనానికి స్వస్తి చెప్పింది. ప్రారంభంలో బిస్కట్లు, రొట్టె లాంటివి తీసుకునేదిట. క్రమంగా అదికూడా మానేసి కేవలం బ్లాక్‌ టీ మాత్రం తీసుకుంటోంది. అదీ రోజుకు ఒకసారి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే. దీంతో ఆమె పేరు చాయ్ వాలీ చాచీగా మారిపోవడంలో ఆశ‍్యర్యం ఏముంది చెప్పండి!

తన పాప ఆరవ తరగతిలో ఉండగా జిల్లా స్థాయి క్రీడా పోటీలకు వెళ్లి వచ్చిన  తరువాత అకస్మాత్తుగా ఆహారాన్ని, మంచినీళ్లను  సైతం ముట్టుకోవడం మానేసిందని పిల్లి దేవి తండ్రి రాఠీ రాం చెప్పారు. అయితే దీనిపై ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదని పిల్లి దేవి సోదరుడు బిహారీ లాల్ రాజ్వేడే చెప్పారు. దీని వెనుకున్న కారణాన్ని ఎవరూ గుర్తించలేకపోయారన్నారు. కానీ, ఆమె ప్రస్తుతం ఎ లాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తోందని తెలిపారు. 

కోరియాలోని జిల్లా ఆసుపత్రి డాక్టర్ ఎస్.కె. గుప్తా ఈ ఉదంతంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే నవరాత్రులు సందర్భంగా కొంతమంది కేవలం టీ మాత్రం సేవిస్తారని విన్నాం...కానీ శాస్త్రీయంగా ఒక మనిషి 33ఏళ్లుగా  కేవలం టీ తాగుతూ ఆరోగ్యంగా  జీవనాన్ని గడపడం వింతేనని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు