అంబేద్కర్‌ పేరు మార్చనున్న యోగి

29 Mar, 2018 12:18 IST|Sakshi
అంబేద్కర్‌కు పూల మాల వేస్తున్న యోగి ఆదిత్యనాథ్‌ (పాత ఫొటో)

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ మరో సంచలనానికి తెర తీశారు. ఏకంగా భారత రాజ్యంగ నిర్మాత పేరును ఆయన మార్చనున్నారు. అవును. డా. భీం రావ్‌ అంబేద్కర్‌గా ఉన్న పేరును ఇక మీదట ‘భీం రావ్‌ రామ్‌ జీ అంబేద్కర్‌’గా యోగి మార్చనున్నారు. యూపీ గవర్నర్‌ రాం నాయక్‌ సూచనల మేరకు అజయ్‌ సింగ్‌ బిస్త్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట అన్ని ప్రభుత్వ రికార్డుల్లో అంబేద్కర్‌ పేరు భీం రావ్‌ రామ్‌జీ అంబేద్కర్‌ గానే ఉండబోతుంది. ఈ అంశం మీద స్పందిస్తూ సమాజ్‌వాద్‌ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ప్రతినిధిని కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించింది.

ఎస్పీ పార్టీ నాయకుడు దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ ‘అంబేద్కర్‌ను, ఆయన విధానాలను వ్యతిరేకించే బీజేపీ పార్టీ ఇప్పుడు ఆయన పేరును మార్చి తమ పార్టీ అంబేద్కర్‌కు వ్యతిరేకం కాదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది’ అని ఆరోపించారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. అంబేద్కర్‌ను ఆయన అసలైన పూర్తి పేరుతో పిలవాలనే ఆయన తండ్రి పేరులోని రామ్‌జీని కూడా తీసుకుని చేర్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వార్తలు