24 గంటల్లో10,956 కేసులు .. 396 మరణాలు

12 Jun, 2020 10:30 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. తాజాగా కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్‌ బ్రిటన్‌ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. శుక్రవారం రోజున కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,956 కేసులు నమోదు కాగా.. 396 మంది మృతి చెందారు. మొత్తంగా 2,97,535 కేసులు, 8,498 మరణాలతో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,41,842 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1,47,195 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53,63,445 కరోనా టెస్టులు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 1,50,305 టెస్టులు నిర్వహించారు. చదవండి: భారత్‌లో మతస్వేచ్ఛ; అమెరికా ఆందోళ 

రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు:
దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటిదాకా మహారాష్ట్రలో అత్యధికంగా 97,648 కేసులు నమోదవ్వగా.. 3,590 మంది మృతి చెందారు. తమిళనాడులో 38,716 కేసులు నమోదవ్వగా.. 349 మంది మృతి చెందారు. ఢిల్లీలో 34,687 కేసులు నమోదవ్వగా.. 1,085 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 22,032 కేసులు నమోదవ్వగా 1,385 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది. 

చదవండి: అందుకే కోట్ల ఆస్తి ఆ ఏనుగులకు రాశా! 

మరిన్ని వార్తలు