వారం‍దరిపైనా నిఘా పెట్టాల్సిందే

27 Mar, 2020 20:14 IST|Sakshi
కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా

న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో విదేశాల నుంచి వచ్చిన వారందరినీ గుర్తించి ‘కోవిడ్‌-19’ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జనవరి 18 నుంచి మార్చి 23 వరకు విదేశాల నుంచి మన దేశానికి 15 లక్షల మంది వచ్చారని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా తెలిపారు. ఈ సంఖ్యకు, ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నవారికి మధ్య అంతరం ఎక్కువగా ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిని తక్షణమే గుర్తించి ‘కోవిడ్‌’ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖల్లో ఆదేశించారు. కరోనా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈ 15 లక్షల మందిపై గట్టి నిఘా ఉంచాలని పేర్కొన్నారు.

అందుకే లాక్‌డౌన్‌: కేంద్ర ఆరోగ్యశాఖ
కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడి వ్యక్తులు.. అక్కడే ఉండాలనే ఉద్దేశంతోనే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఎక్కడి వ్యక్తులు.. అక్కడే ఉంటే సురక్షితంగా ఉంటారని సూచించింది. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించినట్టు వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఆస్పత్రులు సిద్ధంగా ఉంచాలని రాష్ట్రాలను కోరినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరినట్టు ప్రకటించింది. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)

>
మరిన్ని వార్తలు