ఎమ్మెల్యేపై లైంగిక దాడి ఆరోపణలు..

5 Sep, 2018 10:56 IST|Sakshi
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ సీపీఎం ఎమ్మెల్యే పీకే శశి (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో సీపీఎం ఎమ్మెల్యే పీకే శశిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో పార్టీ కేంద్ర కమిటీ జోక్యం చేసుకోలేదని ఆ పార్టీ వివరణ ఇచ్చింది. కేరళ పార్టీ రాష్ట్ర శాఖే ఈ ఉదంతాన్ని డీల్‌ చేస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ ఎమ్మెల్యే విషయంలో కేంద్ర కమిటీ జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేస్తోందన్న వార్తలు నిరాధారమని స్పష్టం చేసింది.

కేరళ పార్టీ కమిటీనే ఈ ఫిర్యాదుపైనా స్పందిస్తుందని, ఎమ్మెల్యే వ్యవహారంలో పార్టీ కేంద్ర కమిటీ జోక్యం చేసుకుంటోందన్న వార్తలు అవాస్తమని తోసిపుచ్చింది. కాగా తనను షోరాన్‌పూర్‌ సీపీఎం ఎమ్మెల్యే పీకే శశి లైంగికంగా వేధిస్తున్నాడని, శారీరకంగా లోబరుచుకోవాలని ప్రయత్నించాడని ఓ డీవైఎఫ్‌ఐ మహిళా నేత ఆరోపించారు. దీనిపై పార్టీ రాష్ట్ర కమిటీ సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌కు , ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు