ఇంటి పైకప్పుపై మొసలి.. వైరల్‌ వీడియో!

12 Aug, 2019 20:16 IST|Sakshi

బెంగళూరు: వర్షాలు పడుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదుల్లో, చెరువుల్లో, కాలువల్లో నివసించే ప్రమాదకరమైన జలచరాలు మనుషుల మధ్యకు వచ్చి హల్‌చల్‌ చేస్తున్నాయి. మొన్నామధ్య వడోదర నగరంలోని వీధుల్లో మొసళ్లు యధేచ్ఛగా విహరించిన సంగతి తెలిసిందే. వీధుల్లో తిష్టవేసిన మొసళ్లను తరలించడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు. ఇక, ఓ వీధిలోని నీటిలో తిష్టవేసిన మొసలి.. అక్కడే తచ్చాడుతున్న కుక్కుపై అమాంతం దాడిచేయబోయింది. కుక్కు చివరినిమిషంలో అప్రమత్తమై  తప్పుకోవడంతో ప్రాణాలతో మిగిలింది. వడోదరలో జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వర్షాలతో అతాలకుతం అవుతున్న కర్ణాటకలోని బెలగావ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలకు బెలగావ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వీధులే కాదు ఇళ్లు సైతం వరదనీటికి మునిగిపోయాయి. దీంతో ఓ మొసలి ఇంటిపైకప్పు మీదకు చేరింది. బెలగావ్‌లోని రాయ్‌బాగ్‌ తాలూకులో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంటు రెకులతో కట్టిన ఇంటి పైకప్పు మీదకు చేరిన మొసలి నోరు తెరుచుకొని కాలక్షేపం చే‍స్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  ఇంటిపైకప్పు వరకు చేరిన వరదనీళ్లను ఈ వీడియోలో చూడొచ్చు. 

చదవండి: మెల్లగా అనుసరిస్తూ.. మెరుపుదాడి..అంతలోనే!

మరిన్ని వార్తలు