తీవ్ర తుపాన్‌గా మారనున్న గజ

13 Nov, 2018 11:56 IST|Sakshi

చెన్నై: చెన్నైకి 760 కి.మీల దూరంలో మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన గజ తుఫాన్‌ మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుఫాన్‌ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గజ తుపాన్‌ గంటకు 7 కి.మీ వేగంతో తీరం వైపు దూసుకొస్తున్నట్టు పేర్కొంది. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం వరకు తమిళనాడులోని పంబన్‌- కడలూరు మధ్య ‘గజ’ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా సూచించింది.

మరోవైపు గజ తుపాన్‌ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అరక్కోణం నుంచి 10 కంపెనీల ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయలుదేరి వెళ్లాయి. తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఇప్పటికే 764 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటితో పాటు పరిస్థితులను ఎదుర్కొవడానికి 700 వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సహాయక బృందాలను సిద్ధంగా ఉంచింది.

మరిన్ని వార్తలు