ఆలస్యంగా నడుస్తున్న 70 రైళ్లు

5 Jan, 2017 09:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాదిలో పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.  దీంతో ఏడు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో 70 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మరో 22 రైళ్లు రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించింది. రద్దు చేసిన ఏడు రైళ్లలో ఇవాళ, రేపు బయలుదేరాల్సి ఉంది. 

రద్దైన రైళ్లలో వారణాసి– జోధ్‌పూర్, న్యూఢిల్లీ–వారణాసి కాశీ విశ్వనాథ్‌, డెహ్రాడూన్‌–హౌరా ఉపాసన ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ జంక్షన్‌– మల్దా టౌన్‌ ఫరక్కా ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. మరోవైపు పొగమంచు ప్రభావం విమాన సర్వీసుల మీద ప్రభావం చూపుతోంది. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు