మెట్రో బోగీల నిండా ప్రకటనలే!

22 Nov, 2014 14:31 IST|Sakshi
మెట్రో బోగీల నిండా ప్రకటనలే!

కేవలం టికెట్లు అమ్ముకుంటే డబ్బులు సరిపోవడం లేదని, అందువల్ల మెట్రోరైలు బోగీల నిండా బయటివైపు ప్రకటనలు గుప్పించాలని ఢిల్లీ మెట్రో వర్గాలు నిర్ణయించాయి. ప్రస్తుతానికి కేవలం ఒక్క రైలు మీదే ఇలా ప్రకటనలు వేస్తున్నామని, వచ్చే వారం నుంచి మరో లైనులో కూడా వేస్తామని ఓ అధికారి తెలిపారు. ద్వారక, వైశాలి స్టేషన్ల మధ్య ఆరు బోగీలతో కూడిన ఈ బ్లూలైన్ రైలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.

యమునా బ్యాంక్, నోయిడా సిటీసెంటర్ స్టేషన్ల మధ్య ఓ కొత్త రైలును ఢిల్లీ మెట్రో ట్రయల్ రన్ చేసింది. డిసెంబర్ నెలాఖరుకల్లా ఇలాంటివి మరో 15 రైళ్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఢిల్లీ మెట్రో అధికారులు చెప్పారు. సాధారణంగా ప్రభుత్వరంగంలోని రవాణా వాహనాలను ఇలా ప్రకటనలతో నింపేయడం ఉండదు. కానీ తొలిసారి ఢిల్లీ మెట్రోలో ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో మొత్తం 200 రైళ్లు తిరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు