వింత నిరసన...

1 May, 2016 08:31 IST|Sakshi
వింత నిరసన...

అధికారులు ఏదైనా పనిని సకాలంలో చేయకపోతేనో, అసలు సమస్యలను పట్టించుకోకపోతేనో... జనం నిరసన తెలపడం సహజం. ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, చీపుళ్లు, బిందెలతో ప్రదర్శనలు... ఇవన్నీ రొటీన్. మహారాష్ట్రలోని బుల్దానా చత్రపతి శివాజీ మార్కెట్ వద్ద రోడ్డు గోతులు పడి పూర్తిగా పాడైపోయిందట.

స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా పబ్లిక్ వర్క్స్ విభాగం వారు అటువైపు కన్నెత్తి చూడలేదట. దాంతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు పీడబ్ల్యూడీ అధికారులు మీటింగ్‌లో ఉండగా... లోనికి చొచ్చుకొచ్చి ఒక్కసారిగా ‘నాగిని డ్యాన్స్’ మొదలుపెట్టారంట. అందరూ మూకుమ్మడిగా నాగిని డ్యాన్స్ చేస్తూ తమ చుట్టూ తిరుగుతుండటంతో అధికారులు బిక్కమొహం వేశారట.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు