కేసు వెనక్కి తీసుకోండి: డీకే శివకుమార్‌

21 May, 2020 17:29 IST|Sakshi

బెంగుళూరు: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పకి లేఖ రాశారు. దాంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని, అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని తెలిపారు. పీఎం కేర్‌ ఫండ్స్‌ని ప్రధాని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.   (సోనియా గాంధీ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు)

ఈ విషయంపై బీజేపీ కార్యకర్త, అడ్వకేట్‌ కేవీ ప్రవీణ్‌ కుమార్‌ సోనియాపై శివమొగ్గలో ఫిర్యాదు చేశారు. దీంతో సోనియా మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలంటూ కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక ముఖ్యమంత్రికి, హోం శాఖా మంత్రికి, డీజీపీకి, శివమొగ్గ సూపరింటెండెంట్‌కి లేఖలు రాశారు.సోనియా గాంధీ ఒక ఎంపీగా నిధులు సక్రమంగా వినియోగించాలని సూచిస్తూ  ఆ ట్వీట్‌ చేశారని, కానీ బీజేపీ నేతలు దానిని తప్పుగా అర్ధం చేసుకొని కేసు నమోదు చేశారని శివ కుమార్‌ పేర్కొన్నారు. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్)

మరిన్ని వార్తలు