మూడేళ్ల తర్వాత ఇంటికి చేరిన యూపీ వ్యక్తి

21 May, 2020 17:31 IST|Sakshi

బెంగళూరు: కరోనా వల్ల అన్ని కష్టాలే కాదు.. కొంత మేలు కూడా జరిగింది అంటున్నాడు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కరమ్‌ సింగ్‌(70). ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరమ్‌ సింగ్‌ మూడేళ్ల క్రితం కొడుకు వివాహానికి అవసరమైన డబ్బు సమకూర్చడం కోసం ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే రైల్వే స్టేషన్‌లో ఒక రైలు బదులు మరొకటి ఎక్కాడు. అలా కరమ్‌ సింగ్‌ బెంగళూరు చేరుకున్నాడు. కొత్త ప్రాంతం, భాష తెలియకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రోడ్ల వెంట నడుస్తూనే ఉన్నాడు. అలా మైసూరు చేరుకున్నాడు. అయితే ఈ కఠినమైన ప్రయాణం, ఆందోళన వల్ల అతడు మతి స్థిమితం కోల్పోయాడు. తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు తదితర వివారాలేం అతడికి గుర్తు లేవు. అలా మైసూర్‌ వీధుల వెంట తిరుగుతూ.. ఎవరైన ఏమైన ఇస్తే తింటూ.. ఫుట్‌పాత్‌ మీద జీవితం గడిపాడు. (భార్యపై అనుమానం.. కరోనాతో అవకాశం)

ఇదిలా ఉండగా కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం వీధుల వెంట ఉండే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు పంపించింది. ఈ క్రమంలోనే కరమ్‌ సింగ్‌ను కూడా నంజరాజా బహదూర్ వృద్ధాశ్రమానికి తీసకెళ్లారు అధికారులు. అక్కడ మానసికవవైద్యులు కరమ్‌ సింగ్‌కు చికిత్స చేశారు. కొంత కాలంలోనే అతడి ఆరోగ్యం మెరుగవ్వడమే కాక జ్ఞాపకశక్తిని తిరిగి పొందాడు. చికిత్స సమయంలో కరమ్‌ సింగ్‌ తాను ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చానని.. తన కుటుంబం వివరాలు తెలియజేశాడు. దాంతో మైసూర్‌ సిటీ కార్పొరేషన్‌ అధకారులు, పోలీసుల సాయంతో కరమ్‌ సింగ్‌ కొడుకును కాంటక్ట్‌ చేయగలిగారు. తండ్రి బతికే ఉన్నాడని తెలిసి  అతను ఎంతో సంతోషించాడు. వెంటనే తండ్రిని ఇంటికి పంపిచాల్సిందిగా కర్ణాటక అధికారులను కోరాడు. (కరోనానీ, క్రిముల్నీ కడిగి పారేద్దాం!)

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘కరమ్‌ సింగ్‌ బతికి ఉన్నాడని తెలిసి అతడి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. మూడేళ్లుగా అతడు కనిపించకపోవడంతో.. చనిపోయాడని భావించారు. అతడిని కుటుంబంతో కలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కరమ్‌ సింగ్‌ని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉత్తరప్రదేశ్‌ పంపిస్తాము’ అన్నారు అధికారులు.(కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది!)

>
మరిన్ని వార్తలు