మహిళలకూ మినహాయింపు వద్దు

8 Nov, 2016 10:56 IST|Sakshi
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించాలంటే సరి-బేసి పద్ధతి నుంచి మహిళలకు, ద్విచక్ర వాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తెలిపింది. ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని అరికట్టేందుకు మూడోసారి సరి-బేసి పద్ధతిని అవలంబించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్ఓతంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఏ) పలు సూచనలు చేసింది. ఏమాత్రం మినహాయింపులు లేకుండా సరి బేసి పద్ధతిని ఢిల్లీ ప్రభుత్వం అవలంబించాలని తెలిపింది. 
 
ఢిల్లీలో రవాణా వ్యవస్థ కారణంగా వచ్చే కాలుష్యంలో 32 శాతం బైకులు, స్కూటర్ల వల్లే వస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే, కేవలం కార్లకే తప్ప బైకులకు, స్కూటర్లకు సరి-బేసి విధానం అమలుకాదు. దాంతోపాటు కేవలం మహిళలు మాత్రమే వెళ్లే కార్లను, సీఎన్‌జీ వాహనాలను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ అంశంపై మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఈపీసీఏలో సభ్య సంస్థ అయిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితా రాయ్ చౌధురి తెలిపారు. 
 
త్వరలోనే సరి-బేసి పద్ధతికి సంబంధించిన నియమాలన్నింటినీ చూసి, మరోసారి ఈ విధానాన్ని అమలుచేస్తే తప్ప కాలుష్యం అదుపులోకి రాదని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థపై కూడా ఆంక్షలు ఉండటం వల్లే ద్విచక్ర వాహనాలను అనుమతించామని ఆయన చెప్పారు. ఢిల్లీలో రోజూ 40 లక్షల మంది బైకులపైనే వెళ్తారని.. వాటిపై కూడా ఆంక్షలు విధిస్తే దాదాపు 20 లక్షల మంది బస్సులు లేదా మెట్రోరైళ్లలో వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఇప్పటికిప్పుడు అంత సామర్థ్యం వాటికి లేదని తెలిపారు. తగిన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటేనే బైకులపై కూడా ఆంక్షలు విధించగలమని ఆయన అన్నారు.
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహారాష్ట్రను ముంచెత్తిన వరద : 16 మంది మృతి

స్విమ్మింగ్‌ పూల్‌ కింద 300 కిలోల గోల్డ్‌!

నేడు ప్రధాని ప్రసంగం!

నివురుగప్పిన నిప్పులా కశ్మీర్‌

మన్మోహన్‌తో కవిత్వ యుద్ధం

సుష్మకు కన్నీటి వీడ్కోలు

కరుణానిధి విగ్రహాన్ని ఆవిష్కరించిన మమత

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

వైరల్‌: రైల్వే ప్లాట్‌ఫాం మీదుగా ఆటో..!

హఫీజ్‌ సయీద్‌ను దోషిగా నిర్ధారించిన పాక్‌ కోర్టు

సెల్యూట్‌తో కడసారి వీడ్కోలు పలికారు!!

ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి-సీఎం జగన్‌ భేటీ

గంజాయ్‌ తాగేవాడు.. గాగ్రా, చోలీ వేసేవాడు!

అలా 25 ఏళ్లకే ఆమెకు అదృష్టం కలిసొచ్చింది

చెన్నైలో డీఎంకే శాంతి ర్యాలీ

ఇప్పుడు ‘ఆర్టికల్‌ 371’పై ఆందోళన

‘ఇక అందమైన కశ్మీరీ యువతుల్ని పెళ్లిచేసుకోవచ్చు’

‘సుష్మ స్పర్శ వారి జీవితాలను మార్చింది’

రామజన్మభూమి యాజమాన్య పత్రాలు పోయాయ్‌

లదాఖ్‌ నుంచి మరో ఉద్యమం!

‘సుష్మ.. నా పుట్టినరోజుకు కేక్‌ తెచ్చేవారు’

మాట తప్పారు దీదీ; స్మృతి భావోద్వేగం!

సుష్మా ప్రస్థానం: కాశీ నుంచి కర్ణాటక వరకు

‘ఎన్నికల్లో పోటీ చేయను.. ధన్యవాదాలు సుష్మ’

‘నన్ను అన్నా అని పిలిచేవారు’

మోదీ-షా తదుపరి టార్గెట్‌ అదేనా?

‘ఒక్క రూపాయి ఫీజు కోసం ఇంటికి రమ్మన్నారు’

‘మా అమ్మను హరి నివాస్‌లో బంధించారు’

పంజాబ్‌లో ఉగ్ర కుట్రకు స్కెచ్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...

ఏంట్రా ఈ హింస అనుకున్నాను!